ఆరోగ్యం
సూర్యుని కాంతికి చర్మం కందిపోయి పాడయిపోవటం చాలా మందికి కలిగే సమస్య. ఇది చర్మాన్ని డార్క్ గా చేయటమేకాకుండా డజను సమస్యల్ని తెచ్చిపెడుతుంది. వాటిలో ముఖ్యంగా చర్మంపై ప్యాచులు పడటం, ర్యాషెస్ రావటం, చర్మం సాగుదలకు గురి అవ్వటం లాంటివి జరుగుతాయి. అంతేకాక ఇది మీ చర్మాన్ని డార్క్ గానూ, మీ చర్మం నిర్జీవంగా కనిపించేలా చేస్తాయి.కొన్ని సరియైన సన్ స్క్రీన్ లోషన్లు వాడినా, ఎన్నిసార్లు పార్లర్లకు తిరిగినా, మరెన్నో జాగ్రత్తలు తీసుకున్నా మీరు ఈ చర్మం కందిపోవటం అంటే ఆంగ్లంలో టాన్ అవ్వటం మాత్రం మామూలే. ఎందుకంటే మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సూర్యుని కాంతి వల్ల మీ చర్మం రక్షింపబడుతుందా? ఖచ్చితంగా ఈ ప్రశ్నకు సమాధానం లేదనే చెప్పాలి. మీ చర్మం ఎండ ధాటికి ఇబ్బంది ఎదుర్కోవాల్సిందే. అందుకే ఇక్కడ మీకుకొన్ని టిప్స్ ని అందిస్తున్నాం. అయితే ఈ టిప్స్ కోసం మీరు ఎక్కడెక్కడికో పరుగిడాల్సిన అవసరం లేదు.. అవి ఎక్కడో కాదు మీ వంట ఇంట్లోనే దొరుకుతాయి. వీటిని వాడటం వల్ల మీరు చక్కని ఫలితాలనే పొందగలరు. కాబట్టి మేము చెప్పే చిట్కాలను మీరు టీవి చూస్తూ, నెట్ చేసుకుంటూ, నిద్రిస్తూ కూడా ఆనందించవచ్చు.
తేనె, నిమ్మ ఫేస్ప్యాక్,
నిమ్మ ఫేస్ప్యాక్ మీ చర్మంపై ట్యాన్ తొలగించేందుకు ఉపయోగపడుతుంది. 1/2 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ తేనె కలిపి పేస్ట్ గా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి,మెడకూ వేసుకోవాలి. ప్రత్యేకంగా చర్మం కంది మచ్చలు ఏర్పడిన చోట తప్పకుండా వేసుకోవాలి. 20 నిముషాల తర్వాత వాష్ చేసుకోవాలి. నిమ్మ ఒక సహజసిధ్ధ బ్లీచింగ్ అయితే, తేనె చర్మాన్నిమృదువుగా చేస్తుంది. చర్మం చక్కగా ఉండేలా చేస్తుంది.
కొబ్బరినీళ్ళుకొబ్బరి నీళ్ళు
కేవలం మీ దాహాన్ని తీర్చటమే కాదు మీ ముఖంపై ఉన్న ట్యాన్ మచ్చల్ని తొలగిస్తుంది. మీ చర్మాన్నిసూర్య కాంతి నుంచీ కందిపోకుండా చూస్తుంది. మీరు రోజూ కనక మీ ముఖానికి కొబ్బరి నీళ్ళు రాసుకోవటం వల్ల ఎంతో మంచిది. దీని వల్ల మీరు రోజు రోజుకీ చక్కగా ఫైర్ గా తయారవుతారు.
టొమాటో, నిమ్మ రసం, పెరుగు ఫేస్ప్యాక్
2 టేబుల్ స్పూన్స్ టొమాటో గుజ్జు, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసి కలుపుకోవాలి. వీటిని చక్కగా మిక్స్ చేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మీ చర్మం ఎక్కడైతే బాగా కంది మచ్చలు ఏర్పడ్డాయో అక్కడ రాసుకోండి. 25-30 నిముషాలు ఉంచుకుని తర్వాత వాష్ చేసుకోవాలి.ఈ ప్యాక్ వల్ల మీ చర్మం చక్కగా తయారవ్వటమేకాక మీ చర్మం పిగ్మెంటేషన్ కు గురి కాకుండా చేస్తుంది. ఇంకో ముఖ్య విషయమేమిటంటే దీనిలో టొమాటో ఉండటం వల్ల కాస్త దురద గా అనిపిస్తుంది.. కాసేపటికి మామూలు అవుతుంది.

No comments