ఇంట్లో దొరికే ఔషదాలు
నిత్యం మన ఇంట్లో ఉండేటు వంటి అల్లం మరియు పసుపు గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు... పసుపుని మనం ప్రతీ వంటలో వాడుతుంటాం. పసుపులో యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ సెప్టిక్, యాంటీ బాక్టీరియల్ గుణాలుంటాయి. ఎప్పుడైనా చర్మం కట్ అయితే తెగిన ప్రదేశంలో పసుపు వాడితే సెప్టీక్ అవకుండా నివారీస్తుంది. అలాగే తక్షణ ఉపశమనం కలుగుతుంది. మొటిమలు నివారిస్తుంది. అల్లం లో ఆంటీ ఫంగస్, యాంటీ బాక్టీరీయల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి.
దగ్గు, జలుబు, అజీర్తి, కడుపు ఉబ్బరం, తలనొప్పి ఇంకా చాలా సమస్యలకు అల్లం మంచి ఉపయోగ కారిణినిగా పనిచేస్తుంది. అల్లంలో పొటాషియం, మెగ్నీషియం, పాస్ఫరస్ మరియు విటమిన్ ఎ, విటమిన్ సి, బి కాంప్లెక్స్ కూడా ఉన్నాయి. కనుక రోజు అల్లం, పసుపు ను వాడటం వల్ల ఎలాంటి సమస్య అయినా దగ్గరికి రాకుండా చేయవచ్చు. కాబట్టి మెడికల్ షాపుల్లో దొరికే మందుల కన్నా మన ఇంట్లో ఉండేటువంటి, ప్రకృతి ప్రసాదించిన వాటిని ఉపయోగించుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నా,యని గ్రహించండి.


No comments