వడదెబ్బకు గురికాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు
రోజు రోజుకి ఎండ తీవ్రత ఎక్కువ అవుతుంది . దీంతో వడదెబ్బ భారిన పడడం సహజం . ఇలా వడదెబ్బ భారిన పడకుండ తీసుకోవలసిన జాగ్రత్తలు ఏవో ఇప్పుడు చూదాం.
అంతకంటే ముందు వడదెబ్బ లక్షణాలు ఎవో చూద్దాం :-
● తల నొప్పి
● తల తిరగడం
● తీవ్రమైన జ్వరం కలిగియుండటం
● మత్తు నిద్ర
● ఫిట్స్
● పాక్షిక లేదా పూర్తి అపస్మారక స్థితి మొదలైనవి.
తీసుకోవలసిన జాగ్రత్తలు :---
◆ తెలుపురంగు గల పలుచటి కాటన్ దుస్తులు ధరించాలి.
◆ తలకి టోపీ పెట్టుకోవాలి లేదా గొడుగు వెంటతీసుకెళ్ళాలి.
◆ మంచినీరు ఎక్కువ సార్లు త్రాగాలి.
◆ ఎండ లో నుంచి వచ్చినవెంటనే చల్లని నిమ్మరసం గాని , కొబ్బరి నీరు గాని , చల్లని మజ్జిగ గాని త్రాగాలి.
◆ వడదెబ్బకు గురైన వారిని నీడగా ఉన్న చల్లటి ప్రాంతానికి వెంటనే చేర్చాలి.
◆ వేసవి కాలం లో నలుపు రంగు దుస్తులు , మందంగా వుండే దుస్తులు ధరించారాదు.
◆ ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు వీలైనంత వరకు బయటి కి వెళ్లకుండా ఉండడం మంచిది.
◆ బైక్ పై ఎక్కువ దూరం వెళ్ళకూడదు.

No comments