కడుపుని 15 నిమిషాల్లో శుభ్రం చేసే అమోఘమైన డ్రింక్!
ఇంటిని మాప్పింగ్ తోను, నోటిని బ్రష్ తోను, ఒంటిని స్నానం తోను ప్రతీ రోజు శుభ్రం చేసుకొనని వారంటూ వుండరు. కానీ కడుపుని శుభ్రం చేసుకునే విషయంలో చాలా నిర్లక్ష్యం చేస్తుంటారు. దీని పర్యవసానంగా రోగాలు జబ్బుల భారీన పడి ఆరోగ్యాన్ని కోల్పోయేవారు అనేక మంది వున్నారు.
మన శరీరం మన దగ్గర వుండటం విశేషం కాదు. అయితే మన శరీరం ఆరోగ్యంగా వుండటమే ప్రాముఖ్యం. కడుపు శుభ్రం లేకపోతే నోరు వాసన వస్తుంది. ఆకలి సరిగ్గా వుండదు. కడుపు లో నులి పురుగులు ఏర్పడతాయి. పోను పోను కడుపు ఉబ్బరంగా వుంటుంది, పొట్ట పెరగడం జరుగుతుంది. కడుపుని వారంలో ఒక రోజైనా శుభ్రం చేసుకోవాలి. మన ఇంట్లో మనమే సులభంగా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చును. తయారు చేసుకోడానికి అవసరమైన పదార్థాలు:- మంచి నీరు,ఆముదం, ఉప్పు, ఒక నిమ్మకాయ.
పానీయం తయారు చేసుకోడానికి ఒక గ్లాసు పరిశుభ్రమైన నులి వెచ్చని వేడి నీటిని తీసుకొని ఒక స్పూన్ ఆముదం(నేచురల్ క్యాస్ట్రాల్ ఆయిల్) కలుపవలెను, సగం స్పూను ఉప్పు కలపాలి, ఒక స్పూన్ నిమ్మరసం కలిపితే పానీయం రెడీ. ఈ పానీయాన్ని ఉదయం పరకడుపున(ఎంప్టీ స్టమక్) తీసుకోవాలి. దీనికి 5 నిమిషాలు ముందు సగం గ్లాసు మామూలు వాటర్ త్రాగాలి.
వారంలో ఒక రోజు మాత్రమే అనగా శనివారం లేదా ఆదివారం సెలవు రోజులో త్రాగాలి. ఆముదం నులి పురుగులను చంపి మరలా అవి ఉత్పత్తి కాకుండా చేస్తుంది. కడుపులోని టాక్సిన్స్ లను శుభ్రం చేస్తుంది. వారంలో ఒక రోజు ఈ విధంగా మన కడుపుని శుభ్రం చేసుకుని రోగాలకు దూరంగా వుండగలం!

No comments