అబ్బాయిలు త్వరగా బరువు పెరగటం ఎలా?
త్వరగా బరువు పెరుగుటకు మంచి మార్గం వేచిచుస్తున్నారా! మీరు స్వతహాగా ప్రణాళికలను రూపొందించుకొని, బరువు పెరగటాన్ని సవాలుగా తీసుకోండి. మీరు సన్నగా ఉండి, జీవక్రియ రేటు వేగంగా ఉంటె మాత్రం బరువు పెరగటం కష్టమనే చెప్పవచ్చు. అబ్బాయిలు త్వరగా బరువు పెరగటం ఎలా? త్వరగా బరువు పెరగటానికి మ్యాజిక్ ట్రిక్ ఏమి లేదు కానీ చిత్తశుద్దితో ప్రణాళికలను పాటిస్తే పాత్రం త్వరగా బరువు పెరుగుతారు.
బరువు పెరగటం అనేది, బరువు తగ్గుటకు చేసేంత శ్రమ పడాలి. సన్నగా ఉన్న అబ్బాయిలు బరువు పెరగటానికి కింద తెలిపిన ఆహార పదార్థాలను తినటం వలన త్వరగా మంచి ఫలితాలను పొందే అవకాశం ఉండనే చెప్పవచ్చు.
అధికంగా తినండి:
తక్కువగా తినటం వలన ఎవరు బరువు పెరగరు. కావున, ఎక్కువ మొత్తంలో ఆహారాన్ని తినాలి. ఎక్కువగా తినటం అంటే కొవ్వు పదార్థాలు మరియు నూనె ఆధారిత పదార్థాలను తినటం వలన ఎక్కువ తిన్న భావన కలుగుతుంది. కానీ, ఎలాంటి ఫాలితం ఉండదు. బరువు పెరగాలి అనుకుంటే మాత్రం అధిక క్యాలోరీలను అందించే ఆహారాలను అనగా కార్బోహైడ్రేట్, ప్రోటీన్ మరియు ఆరోగ్యకర కొవ్వు పదార్థాలను తినటం మంచిది.
కార్బోహైడ్రేట్'లు అధికంగా ఉండే ఆహరం: రైస్, పాస్తా, బ్రెడ్, బంగాళదుంప, బీన్స్, చిలకడదుంప, ఓట్మీల్, పండ్లు మరియు కూరగాయల నుండి బరువు పెరుగుటకు అవసరమయ్యే కార్బోహైడ్రేట్'లను పొందవచ్చు.
ప్రోటీన్'లను అధికంగా కలిగి ఉండే ఆహారాలు: చికెన్, లీన్ బీఫ్, స్టీక్స్, గుడ్లు, సాల్మన్ చేప, పాలు మరియు కాటేజ్ చీస్'లలో ప్రోటీన్'లు అధికంగా ఉంటాయి.
ఆరోగ్యకర కొవ్వు ఉండే ఆహారాలు: ఆలివ్ ఆయిల్, అవకాడో, నట్స్, పీనట్ బటర్ మరియు ఫ్లాక్స్ ఆయిల్'ల నుండి ఆరోగ్యకర కొవ్వు పదార్థాలను పొందవచ్చు.
సరైన సమయంలో తినండి:
మీరు త్వరగా బరువు పెరగాలి అనుకుంటే మాత్రం ఆహారాన్ని రోజు ఒకే సమయానికి తీసుకోవాలి. కింద తెలిపిన విధంగా పాటించని సమయంలో మీరు బరువు పెరగటం చాలా కష్టమే అని చెప్పవచ్చు.
ప్రతి 2 నుండి 3 గంటలకు ఒకసారి తినండి. కొంచెం, కొంచెం తింటూ ఎక్కువ సార్లు తినండి.
ఉదయాన చేసే అల్పాహారాన్ని ఎక్కువగా ఉండేలా చూసుకోండి. యోగ్ హార్ట్, పండ్లు, ఒక గ్లాసు పాలు, మరియు ఎగ్ సాండ్విచ్ వంటి వాటిని తినండి. వీటితో పాటూ, అధిక మొత్తంలో ఆహార స్వీకరణతో పాటూగా శరీర చర్మాన్ని హైడ్రేటేడ్'గా ఉండేలా చూసుకోండి.
అధికంగా నీటిని తాగండి. ఆరోగ్యకర ద్రావణాలు
ఆహరంతో పాటూ, ఆరోగ్యకర ద్రావణాలను అనగా ప్రోటీన్ షేక్ వంటి వాటిని తాగటం వలన వ్యాయామాలను అనుసరించట వలన శరీర కండరాల ద్రవ్యరాశి పెరుగుతుంది. రోజులో రెండు సార్లు ప్రోటీన్ షేక్'లను తాగటానికి ప్రయత్నించండి మరియు ప్రోటీన్'లను అధికంగా కలిగి ఉండే బిస్కట్'లను తినండి. బరువు పెరగాలి అనుకునే ప్రతి ఒక్కరు ఆరోగ్యకర ఆహార పదార్థాలను తినండి.
క్యాలోరీలు:
బరువు త్వరగా పెరగాలి అనుకుంటే మాత్రం, మీరు ఉన్న బరువుకు కనీసం 20కిలో క్యాలోరీలను తినాలి. కావున, మీరు పాటించే ఆహార ప్రణాలికలలో అధిక క్యాలోరీలను ఉన్న ఆహారాన్ని కలపండి.
100 గ్రాముల పీనట్, ఉదాహరణకు- 500 కిలో క్యాలోరీలు మరియు 100 గ్రాముల వైట్ పాస్తా 380 కిలో క్యాలోరీలను కలిగి ఉంటుంది.
ఆరోగ్యకర ఆహారాల నుండి ఎన్ని క్యాలోరీలను పొందతున్నారో మీకు తెలుసు, కావున అధికంగా తీసుకోటానికి ప్రయత్నించండి.
వ్యాయామాల పాత్ర:
ఒకవేళ మీరు తినే ఆహారాల ద్వారా మాత్రమే, బరువు పెరగాలి అనుకుంటే ఇది చాలా తప్పనే చెప్పాలి. కావున, బరువు పెరుగుటకు ఆరోగ్యకర ఆహరంతో పాటూ, వ్యాయామాలు కూడా అవసరమే అని చెప్పవచ్చు. కావున, బరువు పెంచే వ్యాయామాలను ఉదాహరణకు, ట్విస్ట్ కర్ల్స్, డీప్ మరియు డేడ్లిఫ్ట్ వంటి బరువు వ్యాయామాలను అనుసరించాలి. ఫిట్నెస్ నిపుణులను సందర్శించి వారి సూచనలను పాటించటం వలన మంచి ఫలితాలను పొందుతారు.
బరువులను ఎత్తటం అనేది కండరాల బరువు పెరగటానికి ఒక మంచి మార్గం అని చెప్పవచ్చు. ప్రారంభంలో తక్కువ బరువు ఉన్న వాటిని ఎత్తులు క్రమంగా ఎక్కువ బరువులను ఎత్తండి.
బరువు పెంచే మరొక వ్యాయామాలుగా స్క్వాట్స్'ను చెప్పవచ్చు.
డేడ్ లిఫ్ట్స్, బెంచ్ ప్రెస్, ఓవర్ హెడ్ లిఫ్ట్స్, పుల్-అప్స్ మరియు డిప్స్ వంటివి కండరాల ద్రవ్యరాశిని పెంచి శరీర బరువును పెంచే వ్యాయామాలుగా చెప్పవచ్చు.
విశ్రాంతి సమయంలో మాత్రమె కండరాలు పెరుగుదల ఉంటుందని మర్చిపోండి. కావున, ప్రతి రోజు వ్యాయామాలను చేయకండి.

No comments