తులసి ఆకులలో వుండే ఔషధ గుణాలు
తులసి అనారోగ్యాన్ని ఆమడ దూరంలో నిలబెడుతుంది తులసి అనేక రోగాల నివారణకు పనిచేస్తుందని ఆయుర్వేదశాస్త్రం చెబుతుంది తులసి మన ఆరోగ్యాన్ని రక్షిస్తుంది తులసి ఆకులను తీసుకున్న తులసి గాలిని పీల్చిన అది మన ప్రాణశక్తిని పెంచుతుంది !ప్రతీ రోజు కొన్ని తులసి ఆకులను శుభ్రం చేసి నమలడం ద్వారా అనేక రకాల రుగ్మతులనుండి బయటపడవచ్చు కాచి చల్లరిచిన నీటిలో తులసి ఆకుల రసాన్ని కలుపుకుని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే మెదడు చురుగ్గా పనిచేస్తుంది అంతేకాకుండా జీర్ణ క్రియ మెరుగు పడుతుంది
తులసి రసంలో తేనే కలిపి తీసుకుంటే కిడ్నిలో ఏర్పడ్డ రాళ్ళూ కూడా కరుగుతాయని చెబుతూ వుంటారు శ్వాశకి సంబంధించిన ఇబ్బందులకు తులసి ఒక మంచి ఔషధము చెప్పవచ్చును జలుబు చేసినపుడు తేనెలో స్పూన్ తులసి రసం కలుపుకుని తాగితే ఉపశమనం లభిస్తుంది అస్మా నివారణకు తులసి మంచి నివారణంగా చెప్పవచ్చు కడుపులో ఏర్పడ్డ గ్యాస్ట్రిక్ సమస్యలకు తులసి ఒక మంచి పరిష్కారం ! తులసి రసాన్ని మిరియాలు పొడిగా చేసి ఆ మిశ్రమాన్ని నెయ్యితో కలిపి తీసుకుంటే గ్యాస్ట్రిక్ మరియు కడుపు ఉబ్బరంగా ఉంటే సమస్యలకు తొలగించుకోవచ్చు కడుపు నొప్పి తగ్గుతుంది అలాగే కడుపులో ఏర్పడ్డ నులిపురుగులు నశిస్తాయి అలాగే బెల్లంతో కలిపి తులసి ఆకుల రసాన్ని తీసుకుంటే కామెర్లు తగ్గుముఖం పడతాయి
ప్రతిరోజు తులసి ఆకులను నమలడం ద్వారా దంత సమస్యలకు దూరం చేయనుకోవచ్చు నోటి దుర్వాసనతో బాధపడినవారు తులసి ఆకులను నమలడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది చర్మంపై దురదలు దద్దుర్లు మొటిమల సమస్య వున్నా వారు తులసి రసాన్ని నిమ్మరసంతో కలిపి రాయడం ద్వారా సమస్యల నుండి బయటపడవచ్చు అంతేకాకుండా మూత్రసంబంధిత వ్యాధులను తగ్గించడంతో సహాయపడుతుంది

No comments