చల్లటి చందనం చేసే మేలు
చల్లదనాన్ని అందించటంలో చందనానికి మించింది లేదని చెప్పవచ్చు. చల్లదనాన్నే కాకా పరిమళాన్ని కూడా వెదజల్లుతుంది. చందనం నాలుగు వేల సంవత్సరాలుగా వాడుకలో ఉంది.
దీనిలో ఉన్న ఔషధగుణాలు మనకు ఎంతగానో ఉపయోగపడుతాయి.
వేసవిలో గంధం చెక్కను అరగదీసి శరీరానికి రాసుకోవడం వల్ల చెమటకాయలు తగ్గుతాయి.
చర్మం కాంతివంతం అవుతుంది. యాంటీ సెప్టిక్ లక్షణాలే కాక కడుపులో మంట, గాయాల నుంచి రక్త స్రావాన్ని తగ్గించే గుణాలు కలిగి ఉంటుంది.గంధం పొడిని నీటిలో వేసుకొని తాగితే మంటను, కిడ్నీ సంబంధిత సమస్యల్ని తగ్గిస్తుంది.
గంధం చెక్కలు మన పుస్తకాల మధ్యలో ఇంకా వస్త్రాల మధ్యలో ఉంచితే పురుగులు అనేవి దరిచేరవు. గంధం చెక్కతో దేవుడి ప్రతిమలు , ఇంకా వివిధ రకాల ప్రతిమలు, అలంకరణ వస్తువులు తయారుచేయపడతాయి.
అలసట చెందిన వారు స్నానం చేసి చందనం వంటికి పట్టించడం వల్ల ఉపశమనం లభిస్తుంది. రక్తం శుభ్రపరుచుకొనుటకు చిటికెడు గంధం నీటితో తీసుకొనవచ్చు. వేడి తగ్గటానికి గంధం ని పచ్చకర్పూరం లో కలిపి శరీరానికి పట్టించాలి.
డయాబెటిస్ వల్ల కలిగే అల్సర్ కు చందనం పూతతో ఉపశమనం లభిస్తుంది. మూత్రంలో మంట తగ్గటానికి తరచుగా ఒక గ్లాస్లో చిటికెడు చందనం తీసుకొనవచ్చు

No comments