కర్బుజా మరియు ద్రాక్షలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి తెలుసా

మధురమైన రుచితో కూడిన ద్రాక్షలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి.అందుకే వీటిని ఆహార నిపుణులు సూపర్ ఫుడ్ గా అభివర్ణిస్తున్నారు .

వీటిలోని పాలీఫినాల్స్ అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తూ కాన్సర్ లని నివారిస్తాయి.అంతే కాదు,ఈ పాలీఫినాల్స్ బీపీ తగ్గేందుకు తోడ్పడుతాయి.


అయితే ఎర్ర ద్రాక్ష తొక్కలో ఉండే రెస్వెట్రాల్ అనే పాలీఫినాల్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిస్తే క్యూఏ రెస్ట్రిన్ అనే ప్లైఓనాయిడ్ ని చేదు కొలస్ట్రాల్ తగ్గించడం ద్వారా గుండె వ్యాధుల్ని నివారిస్తుంది.అధికంగా ఉండే పొటాషియం,పీచు కూడా గుండె పనితీరుపై దోహదపడతాయి.ఇంకా క్యూఏ రెస్టిన్ వాళ్ళ కొన్ని రకాల అలర్జీలు కూడా తగ్గుముఖం పడతాయని తేలింది.వారానికి మూడు సార్లైనా ద్రాక్ష పండ్లని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మధుమేహం వ్యాధికి కూడా దూరంగా ఉండొచ్చు.

పైగా వృద్యాప్యంలో చక్కర వ్యాధితో వచ్చే రెటీనా సమస్యల్ని కూడా తగ్గుముఖం పడతాయి.అంతే కాదు,అల్జీమర్స్,వ్యాధిని మెనోపాజ్ సమయంలో తలెత్తే భావోద్వేగ హెచ్చు తగ్గులను ఇవి నియంత్రిస్తాయి.


కర్బుజా పండ్లు దాహాన్ని తీర్చడంతో పాటు ఆరోగ్య సమస్యల్ని నివారిస్తాయి అంటున్నారు హార్వర్డుకు చెందిన పోషకాహార నిపుణులు.వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వలనఊబకాయం,మధుమేహం,హృద్రోగాలు,వంటి సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది.జియాక్షంతిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు వృద్యాప్యంలో వచ్చే కంటి కండరాల క్షీనతని తగ్గిస్తాయి.

*కర్బుజాలో బీటా కెరోటిన్,విటమిన్ సి లు తక్కువగా ఉంటాయి.ఇవి ఆస్తమా రాకుండా అడ్డుకుంటాయి.ప్రొస్టెన్ క్యాన్సర్ను నియంత్రిస్తాయి.


*ఈ పండ్లలో ఎక్కువగా ఉండే పీచు,పొటాషియం లు బీపీని తగ్గిస్తాయి.ఫలితంగా పక్షవాతం వచ్చే ఆస్కారం తగ్గుతుంది.ఎముకల సాంద్రత క్షిణించకుండా చేస్తాయి.మూత్రపిండాల్లో రాళ్ళూ ఏర్పడకుండా చేస్తాయి.

*వీటిల్లో ఎక్కువగా ఉండే నీరు,ఎలెక్ట్రోలైట్ల కారణంగా డిహైడ్రషన్ రాకుండా ఉంటుంది.

No comments

Powered by Blogger.