మధురమైన ఈ ఫలాలు మీ హృదయాన్ని పదిలంగా వుంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి
సాధారణంగా అధిక కొలెస్ట్రాల్ అనేది గుండె జబ్బులకు మూలకారణం. కాబట్టి మనం తీసుకొనే ఆహారంలో కొవ్వు పదార్ధాలు అతి తక్కువ శాతంలో ఉండేలా చూసుకోవాలి. పళ్లను చేర్చకుండా ఆహారం ఎప్పటికీ సమతుల్యమవదు. కాబట్టి ఆహారంలో పండ్లు తప్పనిసరి. పండ్లు తినడం అనగానే మార్కెట్ నుంచి పండ్లు కొనితెచ్చి కోసుకుని తినడం మాత్రమే కాదు.గుండెను ఆరోగ్యంగా ఉంచే పండ్లను తినడం మంచిది.గుండె ఆరోగ్యానికి మేలు చేసే పండ్లు ఏవో తెలుసుకోవడానికి ఒక చిన్న చిట్కా వున్నది. పైగా రుచికరమైనది. బాగా ముదురురంగుల్లో మెరుస్తున్నట్లు కనిపించే రంగులతో ఉండే పండ్లన్నీ గుండెకు మేలు చేసేవే.ఈ పండ్లు తినడం వల్ల గుండె ఆరోగ్యం పదికాలాల పాటు పదిలంగా ఉంటుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడే ముఖ్యమైన పండ్ల గురించి ఈ వ్యాసంలో తెలుసుకుందాం .
1.పుచ్చకాయ :
పుచ్చకాయ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలన్న కోరికను తగ్గిస్తుంది. స్థూలకాయాన్ని హరించే గుణం దీనికి ఉంది. ఇందులోని పొటాషియమ్ రక్తపోటును నియంత్రిస్తుంది. పుచ్చకాయలోని పై అంశాలన్నీ గుండెజబ్బులను నివారించడంలో కీలక భూమిక పోషించేందుకు ఉపకరించేవే.
2.నారింజపండ్లు:
నిమ్మజాతికి చెందిన పండ్లన్నీ గుండెకు మేలు చేసేవే. బాగా పండిన నారింజలో విటమిన్ -ఏ, బి6, సి పుష్కలంగా ఉంటాయి. దాంతోపాటు ఫోలేట్ పొటాషియమ్, ఫైబర్ ఎక్కువ. పొటాషియమ్ వల్ల రక్తపోటు తగ్గుతుంది. గుండెకు రక్షణ కలుగుతుంది.
3.కివీ పండు :
కివీ పండ్లు గుండెకు చాలా మేలు చేస్తాయి. ఇందులోని యాంటాక్సిండెట్ శరీరాన్ని దీర్ఘకాలంపాటు యౌవనంగా ఉంచుతుంది.
4.ఆప్రికాట్ :
ముదురు నారింజ లేదా పసుపు రంగులో ఉండే ఆప్రికాట్స్ గుండెకు మంచివి. ఇందులో ఉండే విటమిన్-కె రక్తకణాల ఆరోగ్యానికి దోహదపడుతుంది.
5.ద్రాక్ష పండ్లు :
ద్రాక్ష పండ్లు గుండెకు మేలు చేస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా గుండెపోటు అవకాశాలను నివారించవచ్చు. ద్రాక్షగింజల్లో చాలా పోషకాలు ఉంటాయి. లినోలిక్ ఆసిడ్, ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ ఆలిగోమెరిక్ ప్రో యాంథో సయానిడిన్స్ వంటివి అందులో కొన్ని ప్రధానమైనవి. ద్రాక్షగింజలు హైకొలెస్ట్రాల్‌ను తగ్గించి, అధిక రక్తపోటు ను అదుపులో ఉంచి, గుండెజబ్బులను నివారిస్తాయి.
6.ఆపిల్ పండు :
ఎర్రటి రంగులో ఉండే ఆపిల్ గుండెకు మేలు చేస్తుంది. ఇందులోని ఫ్లేవనాయిడ్స్ రక్తనాళాల్లోని ప్లేట్‌లెట్లు రక్తనాళాల గోడలకు అంటుకోకుండా చూస్తాయి.
7.బెర్రీపండ్లు :
బ్లాక్‌బెర్రీ, బ్లూబెర్రీ, రాస్ప్‌బెర్రీ పండ్లలో ఉండే విటమిన్ సి, ఫోలేట్, ఫైబర్ అన్నీ శరీర ఆరోగ్యానికి దోహదపడతాయి. ఇంకా ఇందులో మ్యాంగనీస్, పొటాషియమ్ ఉంటాయి.
8.బొప్పాయి పండు:
ముఖ్యంగా బొప్పాయి పండులో విటమిన్ సి, ఫోలెట్, కెరోటినాయిడ్స్ మరియు సాధారణంగా జీర్ణశక్తిని పెంచి ఎంజైములు కలిగి ఉంటుంది. ఒక కప్పు పపాయ ముక్కల్లో 55 కెలోరీలు ఉంటాయి. తరచూ బొప్పాయిపండును ఆహారంగా తీసుకుంటుంటే శరీరానికి కావలసిన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో పెప్సిన్ అనే పదార్థం ఉండటం వలన జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది.

No comments