ఎండాకాలంలో చెరుకురసం తాగితే కలిగే లాభాలు ఎన్నో
ఎండాకాలం సూర్యుడు నడినెత్తిన ఉన్నప్పుడు ఆ.. మండుటెండలో కాసింత చెరుకు రసంలో, కొద్దిగా నిమ్మరసం పిండి, చల్లని ఐస్ ముక్కలు వేసి ఇస్తే.. అలాంటి చెరుకురాసాన్ని తాగితే… ఆహా అప్పుడు వచ్చే మజాయే వేరుగా ఉంటుంది కదా!
అవును, అలాంటి సమయంలో ఎండ తాపానికి ఎవరికైనా చల్లని చెరుకు రసం తాగాలనే ఉంటుంది. అందుకే వేసవి వచ్చిందంటే చాలు మనకు రోడ్ సైడ్ ఫుట్ పాతులపై ఎక్కువగా చెరుకు రసాన్ని విక్రయించే చిరు వ్యాపారులు కనిపిస్తారు.
అయితే మండుతున్న ఎండల్లో చెరుకు రసం మన దాహార్తిని తీర్చడమే కాక, ఎన్నో పోషకవిలువలను కూడా అందిస్తుంది. అంతే కాదు పలు అనారోగ్య సమస్యలను సైతం దూరం చేస్తుంది. మరి చెరుకు రసం తాగటం వల్ల కలిగే ఆ.. లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
ఎండాకాలం చెరుకు రసం తాగితే శరీరంలో ద్రవాలు సమతుల్యం అవుతాయి. దీంతో వడదెబ్బ తగలకుండా ఉంటుంది.చెరుకురసంలో ఐరన్, కాల్షియం, మెగ్నిషియం, ఎలక్ట్రోలైట్స్ అధికంగా ఉంటాయి. ఇవి డీహైడ్రేషన్ సమస్య నుంచి బయటపడేస్తాయి.తక్షణ శక్తినిచ్చే ప్రోటీన్లు, కార్బొహైడ్రేట్లు ఇందులో అధికంగా ఉండుటచే దీనిని తాగటం వలన అలసట తగ్గిపోతుంది.యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఏర్పడే ఫ్రీ ర్యాడికల్స్ ప్రభావాన్ని తగ్గించి, కణాలు నాశనం కాకుండా కాపాడతాయి. దీంతో శరీర రోగ నిరోధక వ్యవస్థ పెరుగుతుంది.
చెరుకు రసం శరీరంలోని ప్రోటీన్ లెవల్స్‌ను పెంచుతుంది.ఇది అనారోగ్యాల బారి నుంచి త్వరగా కోలుకునేలా చేస్తుంది.సాధారణ జలుబు, మరియు ఇతర ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తుంది.చెరుకు రసాన్ని తరచూ తీసుకుంటే మలబద్దకం తొలగిపోతుంది.సహజసిద్ధమైన లాక్సేటివ్ గుణాలు దీంట్లో ఉన్నాయి.
అందువల్ల కడుపులో మంట, అసిడిటీ వంటి సమస్యలు తగ్గిపోతాయి.నోటి దుర్వాసనను, దంత క్షయాన్ని తగ్గించే అనేక రకాల విటమిన్లు, మినరల్స్ చెరుకు రసంలో ఉన్నాయి.చెరుకు రసం రక్తంలోని చక్కెర స్థాయిలపై ప్రభావం చూపుతుంది. అందుచే మధుమేహం ఉన్నవారు కూడా నిరభ్యంతరంగా చెరుకు రసాన్ని తాగవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
మూత్రాశయ ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి రక్షిస్తుంది. కిడ్నీల పనితనం మెరుగు పడుతుంది.లివర్‌ను పటిష్టం చేస్తుంది. పచ్చకామెర్ల వ్యాధి ఉన్న వారికి చెరుకు రసం గొప్ప ఔషధమని ఆయుర్వేదం చెబుతోంది. ఇవేకాక మరెన్నో లాభాలు ఎండాకాలంలో చెరకురసం తాగటం వల్ల కలుగుతాయి.

No comments